![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నాటి లెజెండరీ యాక్టర్స్ ని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక జడ్జ్ ఇంద్రజ శివగామి రోల్ లో వచ్చింది. "ఎన్నో వినోదాలను ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇదే నా మాట నా మాటే శాసనం" అంటూ చెప్పింది. నూకరాజు బాహుబలిగా వచ్చి "మీరు ఈ గెటప్ ఎందుకు వేశారు నన్ను ఈ గెటప్ ఎందుకు వేయించారు" అని అడిగాడు. మన ఆర్టిస్టులంతా ఈ సినిమాలలో వచ్చిన పాపులర్ గెటప్స్ వేసుకుని ఇక్కడికొచ్చి పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది" అని అడిగేసరికి అదిరిపోద్ది అని చెప్పాడు నూకరాజు.
అలా డిజె టిల్లు మూవీలో రాధికా గెటప్ లో రష్మీ, చంద్రముఖి మూవీలో రజనీకాంత్ వేంకటపతి రాజు గెటప్ లో ఆటో రాంప్రసాద్, రాములమ్మగ ధరణి, వెన్నెల గెటప్ మహేశ్వరీ, కాంచన గెటప్ లో భానుశ్రీ, చంద్రముఖి గెటప్ లో ప్రిన్సి, దేవసేన గెటప్ లో ఫైమా, కోవై సరళ గెటప్ లో నటకుమారి, తెలంగాణ శకుంతల గెటప్ కొమరక్కా వచ్చారు. "నువ్వెవరు" అని రష్మీని అడిగాడు రాంప్రసాద్, రాధికా అని చెప్పేసరికి నీకు కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు అంటూ సెటైర్ వేసాడు. "ఏయ్ కాంచన నువ్వెంటి ఇలా వచ్చావ్" అనేసరికి భానుశ్రీ తెలిసిపోయిందా అంటూ కామెంట్ చేసింది. ఇలా ఈ లెజెండరీ నటీమణుల మూవీస్ లో కొన్ని బిట్స్ తీసుకుని స్పూఫ్ గా చేసి ఎంటర్టైన్ చేశారు. చివరికి సౌందర్య, శ్రీదేవి, తెలంగాణ శకుంతల, సావిత్రిని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
![]() |
![]() |